Postal Department Recruitment 2024 | IPPB Executive Recruitment 2024 | రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | 344 గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – Telugu Tech
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) నుండి కొత్తగా 344 గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ పరిధిలో చేపట్టే ఈ రిక్రూట్మెంట్ ద్వారా రాత పరీక్ష లేకుండా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు తేదీలను క్రింద తెలుసుకోండి.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)
పోస్టుల సంఖ్య:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 344 గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీలు భర్తీ చేయబడతాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 పోస్టులు
- తెలంగాణలో 15 పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరణ:
గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు సంబంధించి అభ్యర్థులు డిగ్రీ పట్టా మరియు రెండు సంవత్సరాల GDS అనుభవం కలిగి ఉండాలి.
విద్యార్హతలు:
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.
- రెండు సంవత్సరాల గ్రామీణ డాక్ సేవక్ (GDS) అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి:
- కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30,000/- జీతం అందించబడుతుంది.
దరఖాస్తు ఫీజు:
- అప్లికేషన్ ఫీజు రూ. 750/-
- ఫీజు రిఫండబుల్ కాదు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల అకడమిక్ క్వాలిఫికేషన్ ఆధారంగా (డిగ్రీ మార్కులు) ఎంపిక జరుగుతుంది. అవసరమైతే రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేది: 11/10/2024
- దరఖాస్తు చివరి తేది: 30/11/2024
- అప్లికేషన్ సబ్మిషన్ & ఫీజు చెల్లింపుల చివరి తేది: 31/11/2024
✍️ మరిన్ని వివరాలు:
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
- 👉 [Click here for official notification]
- 👉 [Click here for official website]
PGCIL 2024 ఉద్యోగాలు |PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply Now!
Trending Hey Pilla Lyric Video Editing